5 September, 2026 | 1:13 AM

'కాంగ్రెస్'లో చేరిన బీజేపీ నేత కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి

05-09-2026 | 12:02am

మల్కాజిగిరి,(విజయ క్రాంతి): నేరేడ్ మెట్  డివిజన్ కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, డివిజన్ మాజీ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా భర్త కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి(Kothapalli Upender Reddy) శుక్రవారం బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. శుక్ర వారం ఆయన, మల్కా జిగిరి  మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు(Former MLA Mynampally Hanumanth Rao) సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో మల్కాజిగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో శరవేగంగా  కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన చూసి తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతునట్లు చెప్పారు. తనను పార్టీలో చేర్చుకున్న మైనంపల్లి హనుమంత రావుకు ఉపేందర్ రెడ్డి ధన్య వాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు