4 September, 2026 | 10:54 PM

Breaking News

ఎల్లుండి ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతల మండల ఎన్నికలు

04-09-2026 | 05:31pm

హైదరాబాద్: ఫిల్మ్ ఛాంబర్‌(Film Chamber)లో ఎల్లుండి నిర్మాతల మండలి ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష పదవికి సి. కళ్యాణ్(Kalyan) ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో, మిగతా కీలక పోస్టుల కోసం రెండు ప్యానెల్స్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ప్రోగ్రెసివ్ ప్యానెల్‌(Progressive Panel)కు అల్లు అరవింద్(Allu Aravind), సురేష్ బాబు(Suresh Babu), దిల్ రాజు(Dil Raju) మద్దతు లభిస్తుండగా, మన ప్యానెల్‌(Mana Panel)కు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మద్దతుగా నిలిచారు. ఎన్నికల నేపథ్యంలో రెండు ప్యానెల్స్ పోటాపోటీగా తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి.

నిర్మాతల సంక్షేమం, పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, నిర్మాతల హక్కుల పరిరక్షణ తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇరు వర్గాలు తమ ప్రణాళికలను వెల్లడించాయి. అధ్యక్ష పదవికి ఏకగ్రీవ(Unanimous) ఎన్నిక పూర్తయినప్పటికీ, మిగతా పోస్టుల విషయంలో పోటీ తీవ్రంగా ఉండటంతో ఫిల్మ్ ఛాంబర్(Film Chamber) ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. తమకు మద్దతు కూడగట్టుకునేందుకు ఇరు ప్యానెల్స్ చివరి దశ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.