చక్రేశ్వర శివాలయంలో వినాయక చవితి ఉత్సవాలకు ఆహ్వానం
బోధన్,(విజయక్రాంతి): ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బోధన్‌లోని శ్రీ చక్రేశ్వర శివాలయం(Sri Chakreshwara Shiva Temple)లో నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాలకు(Vinayaka Chavithi celebrations) హాజరుకావాలని ఉత్సవ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే షకీల్ అమెర్ను(Former MLA Shakeel Amer) ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే షకీల్ అమెర్‌ను కలిసి ఉత్సవాల వివరాలను తెలియజేసి, కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. వినాయక చవితి నవరాత్రులను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పూజారి లింగం, కౌన్సిలర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






