గణేష్ మండపాలను దర్శించిన మాజీ మున్సిపల్ చైర్మన్
సత్తుపల్లి.సెప్టెంబర్ 23.(విజయ క్రాంతి): పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్(Former Municipal Chairman) కూసంపూడి మహేష్ గణేష్ మండపాలను దర్శించి ప్రత్యే పూజలు నిర్వహించారు. పట్టణంలోని జవహర్ నగర్ సింగరేణి(Jawahar Nagar Singareni) కోటర్స్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించి గణనాథునికి పూజలు చేశారు. అనంతరం గాంధీనగర్ లో గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని కూసంపూడి మహేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
వినాయకుని ఆశీస్సులతో సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ ఆకాంక్షించారు. వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.