గణపసముద్రం సరస్సు వద్ద విద్యుత్ స్తంభాల ఏర్పాటు

23-09-2026 | 01:49pm

గణప సముద్రం సరస్సు వద్ద 10 విద్యుత్ స్తంభాల ఏర్పాటు 

గణపురం, సెప్టెంబర్ 23 (విజయ క్రాంతి): రాత్రివేళ భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గణప సముద్రం సరస్సు వద్ద 10 విద్యుత్ స్తంభాలు అదనంగా  ఏర్పాటు చేశారు. గతంలో సరస్సు నీటిమట్టం ఎక్కువగా ఉండటం వల్ల మిషన్ భగీరథ పంపు హౌస్ వద్ద నిమజ్జనం చేసేవారు ప్రస్తుతం నీటిమట్టం తక్కువగా ఉండడంతో ప్రత్యేకంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ ఏఈ వెంకటరమణ ఆధ్వర్యంలో సిబ్బంది పనులు పూర్తి చేశారు. కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం కెటిపిపి సౌజన్యంతో విద్యుత్తు లైట్లను నిమజ్జన స్థలం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు