తెలంగాణకు ముప్పు
7 జిల్లాల్లో హై అలర్ట్
హైదరాబాద్: బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రతరం కావడంతో తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department officials) హెచ్చరించారు. తెలంగాణపై వాయుగుండం ప్రభావం పడింది. దీంతో రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy rains ) కురిసే అవకాశమున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అటు జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem), ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్ కు అధికారులు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని భారత వాతావరణ శాఖ(India Meteorological Department) వెల్లడించింది. విశాఖకు 220 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయింది. కళింగపట్నానికి 140 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని, నేడు విశాఖ-గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.