భద్రాద్రి థర్మల్‌లో టెక్నికల్ ట్రబుల్
23-09-2026 | 12:46pm
270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
మణుగూరు, సెప్టెంబర్ 23,(విజయక్రాంతి): భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో మూడో యూనిట్(Bhadradri Thermal Power Station) సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. దీంతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. యూనిట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అధికారులు అప్రమత్తమై మరమ్మతు పనులు చేపట్టారు. లోపాన్ని గుర్తించి యూనిట్‌ను తిరిగి ఉత్పత్తిలోకి తీసుకువచ్చేందుకు సాంకేతిక సిబ్బంది చర్యలు కొనసాగిస్తున్నారు. మరమ్మతు పనులు పూర్తయిన అనంతరం యూనిట్‌ను పునఃప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.