కౌశిక్ రెడ్డిపై కీలక భేటీ.. ఏం జరగబోతోంది?
ఎథిక్స్ కమిటీ నిర్ణయంపై ఉత్కంఠ
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై(BRS MLA Padi Kaushik Reddy ) వచ్చిన ఆరోపణల వ్యవహారం ఇప్పుడు శాసనసభ నైతిక విలువల కమిటీ ముందుకు వచ్చింది. శాసనసభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరిని(MLA Kadiyam Srihari) దూషించారన్న ఆరోపణలపై కౌశిక్ రెడ్డికి ఇప్పటికే కమిటీ(Ethics Committee inquiry) నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న ఆయన నుంచి వివరణ కోరగా.. సమాధానం ఇవ్వడానికి కనీసం ఆరు వారాల సమయం కావాలని కౌశిక్ రెడ్డి కోరారు.
అంతేకాకుండా, ఆ రోజు సభలో జరిగిన పూర్తి కార్యకలాపాల వీడియో ఫుటేజీని కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే, తాజాగా కౌశిక్ రెడ్డి తన వివరణను కమిటీకి సమర్పించినట్లు తెలుస్తోంది. ఆయన వివరణపై కమిటీ సంతృప్తిగా లేదన్న సమాచారం నేపథ్యంలో బుధవారం జరిగే సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. కమిటీ ఈ అంశంపై మరోసారి చర్చించి, తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అవసరమైతే కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు(Speaker) సిఫార్సు చేసే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.