విఘ్నేశ్వర మైసమ్మ తల్లి నాలుగవ వార్షికోత్సవం

23-09-2026 | 01:03pm

నేడు గణపతి హోమం, అన్నదానం

రాజన్న సిరిసిల్ల 23 సెప్టెంబర్ (విజయక్రాంతి): శ్రీ విఘ్నేశ్వర మైసమ్మ తల్లి ఉత్సవ కమిటీ(Committee) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం  శ్రీ విఘ్నేశ్వర స్వామి(Lord Vigneshwara)వారి సన్నిధిలో ప్రత్యేకంగా గణపతి హోమం నిర్వహించారు.అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు, సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి అనుగ్రహం పొందాలని  కోరారు.

మరిన్ని వార్తలు