స్మగ్లర్ల గుప్పిట్లో అటవీశాఖ?

23-09-2026 | 05:00am
  1. కంచే చేను మేస్తుంటే.. కాపాడేదెవరు?
  2. అక్రమ కలప రవాణాపై అధికారుల తీరుపై విమర్శలు

కల్లూరు, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): పర్యావరణాన్ని(environment), అటవీ సంపదను(Forest wealth) పరిరక్షించాల్సిన అటవీశాఖ(Forest Department)పై అవినీతి, అక్రమ కలప రవాణాకు(Illegal timber transportation) సంబంధించి తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేయా ల్సిన అధికారులే స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటవీ సంపద తరలిపోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

‘టన్నుకు ఎంత?’.. ఆరోపణలు

కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు కొందరు అక్రమ కలప రవాణాదారులతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలప రవాణాకు సంబంధించి మామూళ్ల వ్యవహారం సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలపై అటవీశాఖ ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

వన్యప్రాణుల రక్షణపై ఆందోళన

అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట(Wildlife hunting), మాంసం అక్రమ విక్రయాలపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. విలువైన కలపను అక్రమంగా తరలించి ఇటుక బట్టీలు తదితర ప్రాంతాలకు చేరవేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

అరకొర జరిమానాలతోనే సరి?

అక్రమ రవాణా పట్టుబడిన సందర్భాల్లో కఠిన చర్యలు తీసుకోకుండా స్వల్ప జరిమానాలతో వ్యవహారం ముగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.  అటవీ సంపదను కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అటవీ అక్రమాలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు