నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి

23-09-2026 | 01:47pm

సరస్సు వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయాలి 

అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి 

గణప సముద్రం వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన 

గణపురం, సెప్టెంబర్ 23 (విజయ క్రాంతి): గణపతి నవరాత్రుల అనంతరం నిర్వహించనున్న నిమజ్జన ఉత్సవాన్ని భక్తులు ప్రశాంతంగా జరుపుకోవాలని అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి(Collector Vijayalakshmi) అన్నారు. బుధవారం ఆమె అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

వివిధ ప్రాంతాల నుండి వచ్చే గణపతి విగ్రహాలను క్రమబద్ధంగా నిమజ్జనం జరిగేలా చూడాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట డి ఎల్ పి ఓ మల్లికార్జున్, తాసిల్దార్ అడ్లూరి రాజేశ్వరరావు, ఎంపీడీవో శ్రీకాంత్ గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్, బుర్రకాయల గూడెం సర్పంచ్ తుమ్మల సంపత్ ,మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి చోటే మియా, మామిండ్ల మల్లికార్జున్ గౌడ్, గుజ్జ గంగాధర్ రావు, దూలం కుమార స్వామి గౌడ్, కసిరెడ్డి వెంకన్న, ఇమ్మడి వెంకన్న, రామారావు, ముదిరాజ్ సంఘం నాయకులు రమేష్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు