దసరా కానుక.. సీతక్క కీలక ఆదేశాలు
హైదరాబాద్: చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి సీతక్క(Minister Seethakka) అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను దసరా పండుగకు ముందే పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలనకు సిబ్బంది కొరత ఉంటే అదనపు సిబ్బందిని అందుబాటులోకి తీసుకోవాలన్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారిని గుర్తించాలని సూచించారు.
దసరా(Dussehra) నాటికి కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సీతక్క అధికారులకు స్పష్టం చేశారు. పెన్షన్(Cheyutha Pension) కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు వీలైనంత త్వరగా ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చూడటం ప్రజా ప్రభుత్వ బాధ్యతని మంత్రి సీతక్క పేర్కొన్నారు. దరఖాస్తుల పరిశీలన నుంచి పెన్షన్ల పంపిణీ వరకు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు(Officials) సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.