పంట నమోదు పక్కాగా ఉండాలి
నిర్మల్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో రైతులు పండించిన పంట నమోదు సర్వే పక్కాగా పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ భవేష్ మిశ్రా(Collector Bhavesh Mishra) సూచించారు. సారంగాపూర్ మండలం గోపాల్పేట్ శివారులో కొనసాగుతున్న క్రాప్ సర్వేను కలెక్టర్ పరిశీలించారు. రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ఏఈవోలు పంట సర్వేపై రైతులను చైతన్యం చేయాలని సూచించారు.
తప్పుడు పంటలు నమోదు చేయ డ ం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని తెలిపారు. పంటల వివరాలు క్రాప్ స ర్వేలో సక్రమంగా నమోదైతే భవిష్యత్తులో ధాన్యం విక్రయాలు, ప్రభుత్వ పథకాల ద్వా రా లభించే సహాయం, ఇతర వ్యవసాయ ప్రయోజనాలు పొందే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ సిబ్బందికి అవసరమైన సహకారం అందించి, తమ పంటల వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని సూచించారు.
క్రాప్ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పంటల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే సిబ్బంది తప్పనిసరిగా రైతుల సమక్షంలోనే పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవ సాగు వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా క్రాప్ సర్వేను పూర్తి చేసేందుకు పదో తరగతి ఉత్తీర్ణులైన స్థానిక యువతను వాలంటీర్లుగా నియమించుకుని వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సర్వే ప్రక్రియను అధికా రులు నిరంతరం పర్యవేక్షిస్తూ, నమోదు ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వం ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఏవో సుజాత, ఎంపీఓ అజీజ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.






