తీరానికి ఐఫోన్లు.. పెర్ఫ్యూమ్ బాటిళ్లు.. వీడియో వైరల్

18-10-2026 | 11:53am

సముద్రపు అలలతో పాటు ఐఫోన్లు, ఖరీదైన పెర్ఫ్యూమ్ బాటిళ్లు తీరానికి కొట్టుకొస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి దృశ్యాలే ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారాయి. హార్ముజ్ జలసంధిలో కార్గో నౌక ప్రమాదానికి గురై బోల్తా పడటంతో అందులోని విలువైన వస్తువులు సముద్రంలో పడిపోయాయని ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ వస్తువులు తీరానికి చేరడంతో స్థానికులు వాటిని ఏరుకోవడానికి పోటీపడుతున్నట్లుగా కొన్ని వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సముద్రంలో కొట్టుకొచ్చిన ఐఫోన్లు, పెర్ఫ్యూమ్ బాటిళ్లను సొంతం చేసుకునేందుకు జనం ఎగబడుతున్నారంటూ వీడియోలను షేర్ చేస్తున్నారు.

అయితే, ఈ వైరల్ దృశ్యాలన్నీ నిజమైనవేనా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది! అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియోల్లో చాలా వరకు కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI)తో రూపొందించినవిగా  చెబుతున్నారు. దీంతో నిజమైన ఘటనకు సంబంధించిన వివరాలు, ఏఐతో సృష్టించిన దృశ్యాల మధ్య తేడాను గుర్తించడం కీలకంగా మారింది.

నౌక ప్రమాదం, సరుకు సముద్రంలో పడిన ఘటనకు సంబంధించిన వాదనలు ఒకవైపు ఉండగా.. తీరానికి ఐఫోన్లు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు కొట్టుకొచ్చాయంటూ వైరల్ అవుతున్న వీడియోలు మరోవైపు చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను నిజమని నమ్మకుండా, దాని మూలాన్ని (Source Verification) పరిశీలించిన తర్వాతే షేర్ చేయాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.


మరిన్ని వార్తలు