స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే కన్నుమూత
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో(Tamil Nadu Politics) విషాదం చోటుచేసుకుంది. కొలత్తూరు నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు (75)(TVK MLA VS Babu) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని MGM హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు.
సెప్టెంబర్ 9న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరిన బాబు అప్పటి నుంచి ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. చికిత్స కొనసాగుతున్నప్పటికీ ఆరోగ్యం క్షీణించడంతో గుండెపోటు సంభవించి మధ్యాహ్నం 2:24 గంటలకు మరణించినట్లు ఆసుపత్రి యాజమాన్యం అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో(Tamil Nadu Assembly Elections) కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాబు.. మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు షాక్ ఇచ్చారు. 8,795 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. గతంలో డీఎంకేలో పనిచేసిన ఆయన పూరసైవాక్కం నియోజకవర్గం నుంచి 2006లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం అన్నాడీఎంకేలో చేరి, 2026లో టీవీకేలోకి వచ్చారు. స్టాలిన్‌పై సాధించిన విజయం ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక మైలురాయిగా నిలిచింది.
