కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఆహ్వానం
19-11-2026 | 11:07pm
ఎల్బీనగర్: కార్తీక పౌర్ణమి(Karthika Pournami) సందర్భంగా ఈ నెల 24న కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవాలయం(Karmanghat Dhyananjaneya Swamy Temple)లో నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలకు హాజరుకావాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావును ఆలయ కార్యనిర్వహణాధికారి లావణ్య మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఇరువురు ఉన్నతాధికారులకు ఆహ్వాన పత్రికలను అందజేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు ఆహ్వానించారు.