ఆదిలాబాద్‌లో రింగ్ రోడ్డు నిర్మాణానికి సహకరించండి

20-11-2026 | 01:09am

కేంద్ర మంత్రి కి ఎమ్మెల్యే పాయల్ వినతి

ఆదిలాబాద్,(విజయక్రాంతి): IRC 85వ వార్షిక సమావేశం(IRC 85th Annual Meeting) సందర్భంగా హైదరాబాద్‌ కు విచ్చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిసారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలతో కూడిన వినతి పత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు. ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రాధాన్యత క్రమంలో అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

అలాగే ఆదిలాబాద్‌లో ఏర్పాటు కానున్న జాయింట్ యూజర్ ఎయిర్‌ ఫీల్డ్, డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్లు, రక్షణ రంగ మౌలిక సదుపాయాలు, మెగా ఇండస్ట్రియల్ పార్క్‌కు మెరుగైన రవాణా అనుసంధానం కల్పించేందుకు రింగ్ రోడ్డు ఎంతో కీలకమని వివరించారు. రింగ్ రోడ్డు నిర్మాణం ద్వారా పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ ఒక ప్రధాన అభివృద్ధి కేంద్రంగా ఎదుగుతుందని ఎమ్మెల్యే కేంద్ర మంత్రి కి వివరించారు.

మరిన్ని వార్తలు