రేవంత్ బ్రదర్స్‌పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు

19-11-2026 | 01:32pm

CM రేవంత్ రెడ్డిపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు.. తెలంగాణను కాపాడాలని పిలుపు

హైదరాబాద్: తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్(Praja Shanti Party President Dr. KA Paul) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు చేస్తూ రాష్ట్రాన్ని కాపాడాలని, అవినీతిని అంతం చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన ఏడుగురు సోదరులు కలిసి ప్రజల సొమ్మును లక్షల కోట్ల రూపాయల మేర దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఆయన ఎలాంటి ఆధారాలను వెల్లడించలేదు.

రూ.50 లక్షలు ఇస్తూ పట్టుబడిన వ్యక్తికి ముఖ్యమంత్రి(CM Revanth Reddy) పదవి కట్టబెట్టి, రాష్ట్రాన్ని దోచుకునేందుకు లైసెన్స్ ఇచ్చినట్లయిందని కేఏ పాల్ విమర్శించారు. భారత్ సమ్మిట్ పేరుతో కాంగ్రెస్ నాయకులు నోవాటెల్ హోటల్‌లో విందులు, వినోదాల్లో మునిగితేలుతున్నారని ఆరోపించారు. ఒకవైపు నాయకులు Party చేసుకుంటుంటే.. మరోవైపు తెలంగాణ ప్రజలు కనీసం తాగునీరు కూడా అందక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. అవినీతిపరులు పాలన సాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా అవినీతి పెరుగుతుందని, ప్రస్తుత పరిస్థితులు అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తెలంగాణను అవినీతి నుంచి కాపాడేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. ఈ అంశంపై Media సంస్థలు, Reporters స్పందించి వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తన వీడియోను విస్తృతంగా Share చేయాలని కేఏ పాల్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.


మరిన్ని వార్తలు