తిరుపతికి కొత్త వందేభారత్.. రూట్, స్టాప్స్ ఇవే!
ఏపీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో వందేభారత్ రైలుకు గ్రీన్ సిగ్నల్!
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు త్వరలో మరో గుడ్ న్యూస్ అందే అవకాశం ఉంది. విశాఖపట్నం నుంచి తిరుపతికి కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్(New Vande Bharat Express ) రైలును ప్రారంభించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ మార్గంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలువురు ఎంపీలు చేసిన ప్రతిపాదనలకు సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది. రైలు Route, Halting Stations, Timingsపై దాదాపు కసరత్తు పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు రెండు, భువనేశ్వర్‌కు ఒకటి, దుర్గ్‌కు ఒకటి చొప్పున మొత్తం నాలుగు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. మరోవైపు విశాఖ నుంచి తిరుపతి(Visakhapatnam to Tirupati) మీదుగా బెంగళూరుకు రాత్రి వేళల్లో Vande Bharat Sleeper Train నడపాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది స్లీపర్ రైలుపై నిర్ణయం తీసుకునే అవకాశముండటంతో, ప్రస్తుతానికి పగటి వేళల్లో విశాఖ-తిరుపతి మధ్య కొత్త వందేభారత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. సూత్రప్రాయంగా సిద్ధం చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ రైలు ఉదయం 5:35 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి సామర్లకోటకు 7:00 గంటలకు, రాజమండ్రికి 7:40 గంటలకు, విజయవాడకు 9:30 గంటలకు చేరుకుంటుంది. అనంతరం ఒంగోలులో 10:55 గంటలకు, నెల్లూరులో 12:15 గంటలకు ఆగి మధ్యాహ్నం 2:10 గంటలకు తిరుపతి చేరుకునేలా ప్రతిపాదించారు.
తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2:55 గంటలకు తిరుపతిలో బయలుదేరి సాయంత్రం 4:48 గంటలకు నెల్లూరు, 6:08 గంటలకు ఒంగోలు, రాత్రి 7:25 గంటలకు విజయవాడ, 9:23 గంటలకు రాజమండ్రి, 10:03 గంటలకు సామర్లకోట చేరుకుంటుంది. చివరగా రాత్రి 11:30 గంటలకు విశాఖపట్నం చేరుకునేలా టైమింగ్స్ రూపొందించినట్లు సమాచారం. అయితే ఇవి ప్రాథమిక సమయాలే. రైల్వే శాఖ తుది అధ్యయనం అనంతరం అధికారిక Schedule విడుదల చేయాల్సి ఉంది. ప్రకటన వెలువడితే విశాఖ నుంచి తిరుపతి వెళ్లే భక్తులు, ఇతర ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు వేగవంతమైన రైలు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది.