తాగునీరు వృథా.. జలమండలి నిర్లక్ష్యం

19-11-2026 | 10:58pm

మన్సూరాబాద్ డివిజన్ లో వృథాగా పోతున్న నీరు 

ఎల్బీనగర్: కరువు కాలంలో చుక్క నీరు సైతం ఎంతో విలువైనది.  గంటల తరబడి మంచినీరు వృథా(Water Waste)గా అవుతున్నా జలమండలి అధికారులు కన్నెత్తి చూడడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో తాగునీరు రోడ్లపాలవుతున్నది. మన్సూరాబాద్ ఎక్స్ రోడ్డు(Mansoorabad X-Road) ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి గంటల తరబడి మంచినీరు రోడ్డు పాలవుతుంది. నీటిని వృథా చేసేవారిపై జరిమానా విధిస్తున్న జలమండలి అధికారులకు ఎంత జరిమానా విధించాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ పనిచేసే జలమండలి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు