కేసీఆర్, హరీశ్‌పై సీఎం రేవంత్ ఫైర్

19-11-2026 | 07:19pm

సిద్దిపేట: సిద్దిపేట పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. సిద్దిపేట మెడికల్ కాలేజీకి తెలంగాణ ఉద్యమ నేత మదన్ మోహన్(Telangana movement leader Madan Mohan) పేరు పెడతామని వెల్లడించారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదని గుర్తుచేశారు.

జిల్లాలో సుమారు రూ.545 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. సిద్దిపేటలో కాంగ్రెస్ బలాన్ని కార్యకర్తలు నిరూపించారని వ్యాఖ్యానించారు. 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేటలోనూ కాంగ్రెస్ గెలిస్తే ఈ నియోజకవర్గానికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ నేతలు కేసీఆర్(KCR), హరీశ్ రావు(Harish Rao)పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మదన్ మోహన్‌కు తగిన గుర్తింపు ఇవ్వకుండా గత పాలకులు వ్యవహరించారని ఆరోపించారు. గతంలో హరీశ్ రావుకు రాజకీయంగా కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekhara Reddy) అవకాశం కల్పించారని గుర్తుచేస్తూ, సిద్దిపేటలో కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు ప్రయత్నించారని విమర్శించారు.

హరీశ్ రావు కుటుంబ ఆస్తులు, రాజకీయ ప్రస్థానంపైనా సీఎం ప్రశ్నలు సంధించారు. మరోవైపు స్థానిక ప్రజలు కోరుకున్న నాయకుడికే కాంగ్రెస్ తరఫున టికెట్ ఇస్తామని, అభ్యర్థిని గెలిపించే బాధ్యత ప్రజలదేనని పేర్కొన్నారు. సిద్దిపేటలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

మరిన్ని వార్తలు