MLA అరెస్ట్.. సెంట్రల్ జైలుకు తరలింపు

28-11-2026 | 12:58pm

మహిళా IAS అధికారిపై వేధింపుల ఆరోపణలు.. TVK ఎమ్మెల్యేకు 15 రోజుల రిమాండ్

తమిళనాడు: మహిళా IAS అధికారికి అసభ్యకరమైన WhatsApp మెసేజ్‌లు పంపారనే ఆరోపణలతో అరెస్టైన TVK ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేశ్‌కు కోర్టు 15 రోజుల Judicial Custody విధించింది. పోలీసుల విచారణ, Medical Examination అనంతరం ఆయనను కల్లకురిచ్చి Judicial Magistrate Court-I ఇన్‌చార్జ్ జడ్జి భానుమతి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం డిసెంబర్‌ 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశిస్తూ, కడలూరు Central Prisonకు తరలించాలని కోర్టు సూచించింది.

మహిళా IAS అధికారిణి చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన తమిళనాడు పోలీసుల Special Investigation Team (SIT) శుక్రవారం ఎమ్మెల్యేను అరెస్టు చేసింది. తనకు అసభ్యకరమైన WhatsApp సందేశాలు పంపడమే కాకుండా, ఇష్టంలేని విధంగా దగ్గరవడానికి ప్రయత్నించారని, రాత్రి వేళల్లో అధికారిక నివాసానికి రావడానికి యత్నించారని ఆమె ఆరోపించారు. IPS అధికారులు కామిని, శ్రుష్టి సింగ్ నేతృత్వంలోని SIT ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేపై తమిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టం, 1998లోని Section 4(1), Bharatiya Nyaya Sanhita (BNS)లోని Section 75(1)(i), 75(1)(iv)తో పాటు Stalkingకు సంబంధించిన Section 78(2), ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించేలా దాడి లేదా బలప్రయోగానికి సంబంధించిన Section 132 కింద కేసులు నమోదు చేశారు.

మరోవైపు ఈ కేసు రాజకీయంగానూ తీవ్ర చర్చకు దారితీసింది. గురువారం ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిసి, ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై తమకు నమ్మకం లేదని తెలిపారు. కేసును Central Bureau of Investigation (CBI)కు అప్పగించాలని డిమాండ్ చేశారు. న్యాయవాది ఆర్. త్రిశూలి పోలీసులను ఆశ్రయించగా, National Commission for Women కూడా Suo Motuగా స్పందించి నిష్పక్షపాత విచారణ కోరింది. ఈ కేసుపై మద్రాస్ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. దర్యాప్తు పురోగతిపై నవంబర్ 27లోగా Report సమర్పించాలని, డిసెంబర్ 22లోగా Final Investigation Report దాఖలు చేయాలని తమిళనాడు పోలీసులను కోర్టు ఆదేశించింది.

ఆరోపణలు వెలుగులోకి వచ్చిందిలా..

ఈ ఘటనలు దాదాపు మూడు నెలల క్రితమే జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ, నవంబర్ 9న DMK ఎంపీ కనిమొళి కరుణానిధి ఈ అంశాన్ని బహిరంగంగా ప్రస్తావించడంతో వెలుగులోకి వచ్చాయి. మహిళా అధికారికి అసభ్య సందేశాలు పంపడంతో పాటు, ఆమె అధికారిక నివాసంలోకి ప్రవేశించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ స్పందనపై ప్రశ్నలు లేవనెత్తడంతో ఈ అంశం Social Mediaలోనూ విస్తృత చర్చకు దారితీసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే అరుల్ విఘ్నేశ్ ఖండించారు. అవన్నీ నిరాధారమైనవని, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో SIT దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు