శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు!
హైదరాబాద్: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు South Central Railway (SCR) గుడ్ న్యూస్ అందించింది. యాత్రికుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కేరళలోని కొల్లాంకు మరిన్ని Special Trains నడపాలని నిర్ణయించింది. జనవరి నెలలో కూడా భక్తులకు ప్రయాణ సౌకర్యం కల్పించేలా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
ఈ మేరకు 07193 నంబర్ ప్రత్యేక రైలు జనవరి 2 నుంచి 23 వరకు ప్రతి శనివారం హైదరాబాద్ నుంచి కొల్లాంకు ప్రయాణించనుంది. రాత్రి 11:10 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి కొల్లాంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07194 నంబర్ ప్రత్యేక రైలు జనవరి 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం కొల్లాం నుంచి హైదరాబాద్కు నడవనుంది. ఈ రైలు ఉదయం 10:55 గంటలకు కొల్లాంలో బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్ వెల్లడించారు.
ఈ Special Trains మార్గమధ్యంలో పలు ముఖ్యమైన Railway Stationsలో ఆగనున్నాయి. సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, ఎర్నాకుళం, కొట్టాయం తదితర స్టేషన్లలో Halt సౌకర్యం కల్పించారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా కేరళకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రయాణం మరింత సులభం కానుంది. శబరిమల Seasonలో రైళ్లలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప భక్తులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, Ticket Availability, రైళ్ల సమయాలు, ఇతర వివరాలను అధికారిక Railway Enquiry ద్వారా పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.