ఎజేకేఎం జూనియర్ కళాశాల విద్యార్థుల వన సమారాధన
ఎర్రుపాలెం, నవంబర్ 28 (విజయక్రాంతి): ఎజేకేఎం (AJKM) జూనియర్ కళాశాల విద్యార్థులు శనివారం వన సమారాధన (Van Samaaradhana) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం దాములూరు కూడలిలోని శివాలయం వద్ద ఈ వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల కరస్పాండెంట్ దండం సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆధ్యాత్మిక, సాంస్కృతిక (Spiritual and Cultural) కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. భారతీయ సమాజంలోని నైతిక విలువలు, ఆచారాలు, ప్రజల మధ్య బాంధవ్యాలు, సంస్కృతిలోని మాధుర్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కళాశాల ప్రిన్సిపల్ నాగిరెడ్డి సౌజన్య, కళాశాల సభ్యులు, సీనియర్ అధ్యాపకులు మిర్యాల శ్యాంసుందర్, నాగిరెడ్డి రమేష్, భూక్య గోపి, గద్దల సత్యనారాయణ, గద్దల శ్రీనివాసరావు, శిరీష, ఎస్.కె. రెహమా తదితరులు పాల్గొన్నారు.