కార్తీక దీపం రూపంలో మృత్యువు.. 18 ఏళ్ల యువతి మృతి

28-11-2026 | 02:54pm

హైదరాబాద్: కార్తీక మాసం(Karthika masam)లో వెలిగించిన దీపం ఓ యువతి ప్రాణాలను తీసింది. ఇంటి గేటు వద్ద జరిగిన అగ్నిప్రమాదం(Fire Accident)లో తీవ్రంగా గాయపడిన 18 ఏళ్ల సాయి వెంకట సింధు చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ విషాద ఘటన కూకట్‌పల్లి(Kukatpally) పరిధిలోని అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో చోటుచేసుకుంది.

సింధు రోడ్ నంబర్ 5లో ఎస్ఎస్ బొటిక్ నిర్వహిస్తోంది. ఈ నెల 12న రాత్రి షాప్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా గేటు వద్ద వెలిగించిన కార్తీక దీపం(Karthika Deepam) ప్రమాదవశాత్తు ఆమె చీరకు అంటుకుంది. దీంతో మంటలు వేగంగా వ్యాపించి ఆమె తీవ్రంగా గాయపడింది.

కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, కొన్ని రోజుల పాటు చికిత్స పొందిన సింధు శుక్రవారం తుదిశ్వాస విడిచింది. చిన్న వయసులోనే ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో విషాదం నెలకొంది.


మరిన్ని వార్తలు