SI ఎగ్జామ్ వేళ పోలీసుల యాక్షన్

28-11-2026 | 10:41am

SI పరీక్ష వేళ పోలీసుల ఆంక్షలు.. 200 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు!

హైదరాబాద్: సివిల్ SI, సమాన స్థాయి పోస్టుల కోసం నిర్వహించనున్న PRBT-2026 Written Exam నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కీలక ఆంక్షలు విధించారు. ఈ నెల 29న పరీక్ష జరగనున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా Police Department ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించారు. అభ్యర్థులు, పరీక్ష సిబ్బంది మినహా ఇతరులు గుంపులుగా ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష సమయంలో ప్రశాంత వాతావరణం కొనసాగించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అదేవిధంగా పరీక్ష కేంద్రాల నుంచి 100 మీటర్ల పరిధిలో ఉన్న Xerox Centres, Photocopy Shops, Internet Centres మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించకుండా సంబంధిత ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులకు పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఆంక్షలు ఈ నెల 29న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి. అయితే అంత్యక్రియల ఊరేగింపులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. కాబట్టి పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ఉండే ప్రజలు, వ్యాపారులు పోలీసుల ఆదేశాలను పాటించాలని అధికారులు సూచించారు.

మరిన్ని వార్తలు