2 ఏళ్ల నిరీక్షణకు తెర.. 5వ వార్డులో సీసీ రోడ్ల పనులు ప్రారంభం

28-11-2026 | 02:40pm

ఖమ్మం రూరల్ (విజయక్రాంతి): ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో సీసీ రోడ్ల (CC Roads) నిర్మాణ పనులను తంబూరు దయాకర్ రెడ్డి ప్రారంభించారు. దాదాపు 12 ఏళ్లుగా రోడ్ల నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న స్థానికుల కల నెరవేరడంతో వార్డులో అభివృద్ధి పనులు (Development Works) ఊపందుకున్నాయి.

వార్డులో రహదారులు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని కౌన్సిలర్ బానోత్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు