శరద్ పవార్‌ది వెన్నుపోటు

28-11-2026 | 12:03pm

రాజ్యసభ సీటు కోసం కాంగ్రెస్ మద్దతు.. ఇప్పుడు డీలిమిటేషన్‌పై విభేదాలు!

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో Delimitation Bill కొత్త వివాదానికి తెరలేపింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) ఈ ప్రతిపాదిత ప్రక్రియకు మద్దతు ప్రకటించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఏడాది రాజ్యసభ ఎన్నికల్లో పవార్‌కు మద్దతుగా తమ పార్టీ సొంత సీటు అవకాశాన్ని వదులుకుందని గుర్తుచేస్తూ Maharashtra Congress సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించింది.

మహారాష్ట్రలో 2026 మార్చిలో ఏడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పట్లో ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్)కు 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా, ఒక అభ్యర్థి గెలవడానికి 36 ఓట్లు అవసరం. కాంగ్రెస్‌కు 16 మంది, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)కు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని సుప్రియా సూలె కాంగ్రెస్ నేతలను కోరినట్లు ఆ పార్టీ తెలిపింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఎలాంటి అభ్యంతరం లేకుండా పవార్‌కు మద్దతు తెలిపారని కాంగ్రెస్ పేర్కొంది. తమకు దక్కాల్సిన రాజ్యసభ సీటుపై Claim వదులుకుని ఆయన అభ్యర్థిత్వానికి అండగా నిలిచామని వెల్లడించింది. అనంతరం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన కూడా మద్దతు ఇవ్వడంతో మహా వికాస్ అఘాడీ (MVA) ఏకగ్రీవంగా పవార్ పేరును ఖరారు చేసిందని గుర్తుచేసింది.

అయితే ఇప్పుడు అదే పవార్, సుప్రియా సూలె, వారి పార్టీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ప్రక్రియకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా విమర్శిస్తూ X Post ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. మరోవైపు, ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) నేత జితేంద్ర అవ్హాద్ నవంబర్ 27న డీలిమిటేషన్ ప్రక్రియకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను సమానంగా 50 శాతం పెంచే ప్రతిపాదన ఉంటే మద్దతు ఇస్తామని పార్టీ వైఖరిని వివరించారు. ఈ ప్రక్రియ రాజ్యాంగపరమైన అవసరమని ఆయన పేర్కొన్నారు. దీంతో Congress–NCP (SP) మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. డీలిమిటేషన్‌పై ప్రతిపక్ష కూటమిలో ఏకాభిప్రాయం లేకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై ఏ పార్టీ ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు