భక్తులపైకి దూసుకెళ్లిన భారీట్రక్కు

19-10-2026 | 05:10am
  1. 15 మంది దుర్మరణం 
  2. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘటన
  3. 33 మందికి గాయాలు
  4. సీతలమాత ఆలయ గోడను ఢీకొన్న లారీ
  5. కూలిపోయిన ప్రహరీ.. నుజ్జునుజైన వాహనం
  6. మృతులకు కేంద్రం 2 లక్షల, రాష్ట్ర ప్రభుత్వం 4లక్షల ఎక్స్‌గ్రేషియా

భోపాల్, అక్టోబర్ 18: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో(Gwalior District) ఆదివారం తెల్లవారుజామను ఓ భారీ ట్రక్కు అతివేగంతో ‘నో -ఎంట్రీ’ జోన్లోకి.. ఆపై నవరాత్రి పూజల కోసం ఆలయం వద్ద గుమిగూడిన భక్తులపై నుంచి దూసుకెళ్లింది. అంతటితో ఆగకుండా రోడ్డు పక్కన ఉన్న దుకా ణాలను, శీతలామాత ఆలయ ప్రవేశ ద్వారాన్ని బలంగా ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో 15 మంది భక్తులు మృతిచెందారు. ఇద్దరు పోలీసు లతో సహా మరో 33 మంది గాయపడ్డారు.

ఆలయ ప్రహరీ కూలిపోగా, వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. పంజాబ్ రిజిస్ట్రేషన్ నంబర్ కలి గిన, వరి ధాన్యంతో నిండిన ఈ లారీ రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో తీవ్ర విషాదఛా యలు అలుముకున్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు ఆలయ గోడలో కొంత భాగం కూలిపోవడంతో, శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయా రని అధికారులు తెలిపారు.

మరణించిన వారిని సతేంద్ర సింగ్ గుర్జర్(22), సరళా తోమర్(50), గౌరవ్ పరిహార్(18), మహేష్ శర్మ (45), విమలేష్ బఘేల్(18), దేవేష్ బఘేల్(17), ఛోటు జాతవ్(16), శౌర్యశర్మ(16), హేమంత్ రాథోడ్(19), దివ్యాన్ష్ కుష్వాహ(17), పవన్ రాథోడ్(23), లవ్‌త్యాగి(15), అమన్ త్యాగి(13), అశోక్ త్యాగి(45), నితేష్(18)గా గుర్తించారు. క్షతగాత్రులను, మృతదేహాలను గ్వాలియర్‌లోని ట్రామా సెంటర్‌తో సహా వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.

ట్రక్కు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడని, అతడి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ట్రక్కు బ్రేకులు విఫలం కావడంతో, వాహనా న్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో డ్రైవర్ దానిని ఎడమవైపునకు తిప్పి ఉంటాడని ఒక దర్యాప్తు అధికారి తెలిపారు. ఒకవేళ ట్రక్కు నేరుగా ముందుకు వెళ్లి ఉంటే, 600 నుంచి 700 మంది భక్తులు ప్రమాదానికి గురయ్యేవారని ఆయన చెప్పారు.

వాహనాలను ఆలయానికి సుమా రు కిలోమీటరు దూరంలో పార్క్ చేయాల్సి ఉండగా, కనీసం సైకిల్ కూడా వెళ్లలేని నిషేధిత ప్రాంతంలోకి ట్రక్కు ఎలా ప్రవేశించిందనే దానిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదంలో మృతులకు ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

అలాగే మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున, ఇతర గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారి చికిత్స ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి, 

నిర్లక్ష్యంగా వ్యవహరించి నందుకు ఆ ప్రాంత సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సీఎస్‌పీ)ని తొలగించడంతో పాటు, మరో 8 మంది పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. నిషేధిత ప్రాంతంలోకి ట్రక్కు ప్రవేశించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, వాస్తవాల ఆధారంగా విచారణ జరిపి నివేదిక  సమర్పించాలని ఆయన జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

మరిన్ని వార్తలు