బైపోల్స్‌లో టీవీకే, బీజేపీ ఆధిక్యం
ఉప ఎన్నికల కౌంటింగ్.. తమిళనాడులో టీవీకే, బెంగాల్‌లో బీజేపీ ముందంజ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐదు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. తమిళనాడులోని మధురాంతకం, ధారాపురం స్థానాల్లో టీవీకే అభ్యర్థులు ఆధిక్యంలో ఉండగా, పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజినగర్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
అసోంలోని నాగావ్ లోక్‌సభ ఉప ఎన్నికలోనూ బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో అసెంబ్లీ స్థానం పుదుచ్చేరిలోని తట్టాంచావడిలోనూ కౌంటింగ్ జరుగుతోంది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ ఆధిక్యాలు మారే అవకాశం ఉండటంతో తుది ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.