కారాముంగి గురుకులంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

09-10-2026 | 05:00pm

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ: ప్రిన్సిపాల్ అంబిక

నాగల్‌గిద్ద, అక్టోబర్ 9 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండలం(Nagalgidda Mandal) కారాముంగి గ్రామంలోని అనుభవ మంటప గురుకుల పాఠశాలలో(Residential School) ప్రిన్సిపాల్ అంబిక ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయినులు(Female students and female teachers) రంగురంగుల పూలతో బతుకమ్మలను(Bathukammas) పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా అంబిక మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి(Telangana Culture), సంప్రదాయాలకు బతుకమ్మ నిలువెత్తు ప్రతీక అని అన్నారు.

తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో జరుపుకునే ఈ పండుగ ప్రకృతితో మానవుడి అనుబంధాన్ని చాటుతుందన్నారు. విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలు పెంపొందించేందుకు ఇలాంటి వేడుకలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయినులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు