విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

09-10-2026 | 05:15pm
  1. సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్
  2. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
  3. ఘనంగా బతుకమ్మ వేడుకలు

గణపురం, అక్టోబర్ 09 (విజయ క్రాంతి): రాష్ట్రంలోని విద్యార్థుల సంక్షేమం(Student Welfare), విద్యాభివృద్ధికి(Educational Development) తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు(Intermediate students) మధ్యాహ్న భోజన పథకాన్ని(Mid-day meal plan) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్(Katkuri Radhika Srinivas) అన్నారు.ఇందులో భాగంగా శుక్రవారం గణపురంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించి బతుకమ్మ వేడుకలను పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై ఏకాగ్రత, విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు మధ్యాహ్న భోజన పథకం దోహదపడుతుందని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యకు దూరం కాకుండా, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించేలా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు తోడ్పడతాయని తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని, ఇంటర్మీడియట్ స్థాయిలోనూ మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సంక్షేమానికి చేపడుతున్న చర్యలను సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువుల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు.

ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని విద్యా రంగంలో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తిరుపతి, పాఠశాల కళాశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు