ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య

09-10-2026 | 05:12pm

విద్యార్థులకు అండగా ప్రభుత్వం

సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్

ప్రభుత్వ యూనిఫాంల పంపిణీ

గణపురం, అక్టోబర్ 09  (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో(Government school) చదువుతున్న విద్యార్థులకు(Students) నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అందించిన యూనిఫాంలను శుక్రవారం గణపురం ఉన్నత పాఠశాలలో(Ganapuram High School) సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు(Educational Facilities) కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు.

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు భరత్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు దూలం కుమారస్వామి గౌడ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు