బతుకమ్మ పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి

09-10-2026 | 05:21pm

వెంకటాపూర్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి(Telangana Culture), సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను(Bathukamma festival) గ్రామాల్లో అంబరాన్నంటేలా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్(Mandal Congress Party President Bandi Srinivas) సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వీబీ-జీ రామ్ జీ పథకం(VB-G Ramji Scheme) ద్వారా గ్రామ పంచాయతీల ఖాతాల్లో నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి సూచనలతో గ్రామాల్లో పండుగ ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

గ్రామాల్లో బతుకమ్మ ఆడుకునే ప్రదేశాలను శుభ్రం చేసి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, లోతైన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు నిధులను సద్వినియోగం చేసుకుంటూ, నిర్ణీత సమయంలో అభివృద్ధి పనులతో పాటు బతుకమ్మ పండుగ ఏర్పాట్లు పూర్తి చేయాలని బండి శ్రీనివాస్ కోరారు.

మరిన్ని వార్తలు