జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే
మానకొండూరులో కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు
ధర్నా రాస్తారోకో
మోడీ దిష్టిబొమ్మ దహనం
మానకొండూరు, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్(Union Election Commissioner Gyanesh Kumar) రాజీనామా డిమాండ్ తో మానకొండూరులో కాంగ్రెస్ పార్టీ(Congress Party) శ్రేణులు కదం తొక్కారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక(Rahul, Priyanka)లపై పోలీసులపై దాడి చేయడంతో పాటు, విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు(Case registered) చేయడంపై మండిపడ్డారు.
శుక్రవారం వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారిపై రోడ్డుపై బైఠాయించి ధర్నా ,రాస్తారోకో చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఓటు బచావో, దేశ్ బచావో నినాదంతో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న రాహుల్, ప్రియాంకలపై అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్ పేరుతో పేదల ఓట్లు తొలగింపు
సర్ పేరుతో పేదల ఓట్లను తొలగించడానికి కుట్రలు చేసిన ప్రధానమంత్రి మోదీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరుపై మానకొండూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధ్యావ శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. మానకొండూరులో నిరసనల కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 13 కోట్ల ఓట్లు గల్లంతు ఘనత బిజెపి పార్టీ దేనని ఎద్దేవ చేశారు. భారత ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజన్నారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అనంతరం మీడియాకు ఇటీవల నూతనంగా ఎన్నికైన బీసీ, ఎస్సీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షులపరిచయ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, సర్పంచులు, సహకార సంఘ అధ్యక్షులు ,డైరెక్టర్లు, సర్పంచులు, ,ఉపసర్పంచ్ లు, ఎస్సీ, బీసీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షులు, తదితరులు హాజరయ్యారు.