మట్టి పరిమళంతో ‘ఎగిలివారంగ’

09-10-2026 | 05:10pm

శర్వానంద్ కథానాయకుడిగా, సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భోగి’. తెలంగాణ పల్లె జీవనాన్ని, జానపద సంగీతంలోని మాధుర్యాన్ని ప్రతిబింబిస్తూ ‘భోగి’ సినిమా నుంచి ‘ఎగిలివారంగ’ తొలి పాట విడుదలైంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నుంచి వచ్చిన ఈ గీతం ప్రేక్షకులకు 1960ల గ్రామీణ వాతావరణాన్ని పరిచయం చేస్తోంది.

చంద్రబోస్ అందించిన సాహిత్యానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. జానపద గాయకుల గాత్రం పాటకు సహజమైన పల్లెదనాన్ని అందించింది. గ్రామీణ జీవనశైలి, సంప్రదాయాలు, మనుషుల మధ్య సంబంధాలను ప్రతిబింబించేలా పాటను రూపొందించారు.

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ గ్రామీణ నేపథ్యానికి తగ్గ వేషధారణలో కనిపిస్తున్నారు. టీజర్‌తో ఆసక్తి పెంచిన ‘భోగి’ చిత్రానికి ఈ తొలి పాటతో సంగీత ప్రచార కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది.


మరిన్ని వార్తలు