రైతుల దగ్గర అక్రమ వసూళ్లు

09-10-2026 | 05:24pm

విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగి బాగోతంపై విజిలెన్స్ విచారణ

 జనగామ, (చిల్పూరు) అక్టోబర్ 9 (విజయక్రాంతి): జనగామ జిల్లా(Jangaon District) చిల్పూరు మండలం శ్రీపతిపల్లి గ్రామంలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగి గడ్డం సిద్దయ్య(Electricity contract employee Gaddam Siddaiah) అక్రమ వసూళ్లకు(Illegal collections) పాల్పడ్డాడంటూ రైతులు(farmers) విద్యుత్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. డీడీల పేరుతో, గృహజ్యోతి పథకం(Gruha Jyothi Scheme), విద్యుత్ స్తంభాల ఏర్పాటు(Installation of electric poles), ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్ మార్పిడి పేరుతో రైతులను భయపెట్టి వేల రూపాయలు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుపై స్పందించిన విద్యుత్ విజిలెన్స్(Electricity Vigilance) ఏడీ శుక్రవారం మల్కాపూర్ సబ్ స్టేషన్(Malkapur Substation) లో విచారణ చేపట్టారు. గడ్డం సిద్దయ్యను, శ్రీపతిపల్లి రైతులను విచారించారు.

విచారణలో వసూళ్లు నిజమేనని తేలిందని, వసూలు చేసిన డబ్బులను త్వరలోనే రైతులకు తిరిగి ఇప్పిస్తామని, బాధ్యుడిపై చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు హామీ ఇచ్చారు. రైతులకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని గ్రామ రైతులు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు