మాచాపూర్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

09-10-2026 | 05:28pm

రంగురంగుల పూలతో బతుకమ్మలు..

విద్యార్థినుల ఆటపాటలతో సందడి..

సిద్దిపేట రూరల్, అక్టోబర్ 9 విజయక్రాంతి: మాచాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో(Machhapur Higher Primary School) శుక్రవారం ముందస్తు బతుకమ్మ ఉత్సవాలను(Bathukamma festivities) ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు(Students), వారి తల్లిదండ్రులు రంగురంగుల పూలను సేకరించి బతుకమ్మలను పేర్చారు. అనంతరం ఉపాధ్యాయులతో(Teachers') కలిసి ఆటపాటలతో సందడి చేస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జనార్దన్ రెడ్డి బతుకమ్మ పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో దాని ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాధిక, రాజయ్య, వసంత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు