బాలీవుడ్ ప్రముఖులకు బెదిరింపులు
- అమితాబ్ బంగ్లా జల్సాను పేల్చేస్తాం!
- గాయకుడు దిల్జిత్, ముంబై మేయర్లను హత్యచేస్తాం
- బాలీవుడ్లో బెదిరింపు ఇ కలకలం
- నాలుగు పాఠశాలలకు బెదిరింపులు
- కేసు నమోదు, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ముంబై, అక్టోబర్ 23: ఓ వైపు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులతో బాలీవుడ్(Bollywood)లో కలకలం రేగగా, మరోవైపు అమితా బచ్చన్, పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్, ముంబై నగర మేయర్ రీతూ తావ్డేలను చంపేస్తామని బెది రింపు ఇ రావడం కలకలం సృష్టి స్తుంది. శుక్రవారం వచ్చిన ఈ బెదిరింపులపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు.
మేయర్ కార్యాలయంలో బాంబు స్కాడ్ బృందాలు తనిఖీలు చేపట్టి ఏమీ లేదని తేల్చాయి. బచ్చన్ జల్సా బంగ్లాను అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 మధ్య ఎప్పుడైనా లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి చేస్తామని హెచ్చరించారు. 1984 నాటి ఆపరేషన్ బ్లూ స్టార్‌కు ప్రతీకారంగానే ఈ దాడులకు సిద్ధప డినట్లు పేర్కొన్నారు. పంజాబ్ గాయకుడు దిల్జిత్ దోసాంజ్‌ను నవంబర్ 27న ఆత్మా హుతి దాడిలో చంపేస్తామని బెదిరించారు. ఆయా బెదిరింపు మెయిల్‌లపై ముంబై పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నాలుగు పాఠశాలలకు బెదిరింపులు..
ముంబైలోని నాలుగు పాఠశాలలను బాంబులతో పేల్చేయబోతున్నట్లు గుర్తు తెలియని దుండగులు పంపిన ఈ మెయిల్ లో పేర్కొన్నారు. పాఠశాలల యాజమా న్యాలు వెంటనే పోలీసులను ఆశ్రయించగా సోదాలు చేపట్టి ఏమీ లేదని తేల్చారు. బాంబు బెదిరింపులతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలకు గురై తమ పిల్లలను పాఠశాలల నుంచి తీసుకువెళ్లేందుకు పెద్ద ఎత్తున గూమి గూడారు.