బెంబేలెత్తిస్తున్న వీధి కుక్కలు
23-10-2026 | 10:56am
- ప్రజల్లో భయం.. భయం
- గుంపులుగా తిరుగుతూ జనాలపై దాడి
- రాత్రి వేళ బయటికి వెళ్లాలంటేనే..
- భయాందోళనలో ప్రజలు, పాదచారులు
కూసుమంచి, అక్టోబర్ 23(విజయక్రాంతి): కూసుమంచిలో(Kusumanchi) వీధికుక్కలంటేనే జనాలు భయాందోళన వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. పగలు, రాత్రి గుంపులు, గుంపులుగా కుక్కలు స్వైర్య విహారం చేస్తుండడంతో జంకుతున్నారు. వాహనాలపై వెళ్లినా వారి వెంట పరుగెత్తి దాడి( Stray Dog Attacks) చేయడంతో భయాందోళన చెందుతున్నారు. దీంతోపాటు అకస్మాత్తుగా కుక్కలు రోడ్లపైకి పరుగేత్తుకుని రావడంతో వాహనదారులు అయోమయానికి గురై కిందపడి గాయపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు రహదారులు వెంట ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కుక్కలను నివారించాలని ప్రజలు స్థానిక సర్పంచ్ ను కోరుతున్నారు.