ప్రభుత్వ హామీలను అమలు చేయాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర
కలెక్టర్ కు వినతిపత్రాలు అందజేసిన ప్రజలు
బీఆర్ఎస్ సమరభేరి కార్యక్రమంలో భాగముగా అందజేత
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Former MLA Gandra Venkataramana Reddy) ఆరోపించారు. ఈ మేరకు బీఆర్ఎస్ సమరభేరి కార్యక్రమంలో భాగముగా గండ్ర ఆధ్వర్యంలో ప్రజలు పలు హామీలతో కూడిన వినతిపత్రాలను సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు అందజేశారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా అన్ని అర్హతలు ఉన్నప్పటికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాని పేద కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించి కలెక్టర్కు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గండ్ర కలెక్టర్ ను కోరారు.
