ఈవీఎం గోదాము వద్ద పటిష్ట భద్రత

08-09-2026 | 01:37am

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (Electronic voting machines) భద్రపరిచిన గోదాము వద్ద నిరంతరం పటిష్ట భద్రత కల్పిస్తూ, సీసీ కెమెరాల ద్వారా ఎల్లవేళలా పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.హరిత(District Collector K. Haritha) తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్(Additional Collector M. David), గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. గోదాములో భద్రపరిచిన ఈవీఎం బాక్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి లోపాలకు తావులేకుండా నిరంతర భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు