గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్
* వైద్య పరీక్షల్లో మత్తు పదార్థాలు సేవించినట్లు నిర్ధారణ
* పునరావాస కేంద్రానికి తరలింపు
నాగర్ కర్నూల్, నవంబర్ 4 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని రామ్‌నగర్ కాలనీలో గంజాయి(Ganja) సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి ఎం.డి. సాహెబ్, మహమ్మద్ ఆఇష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల్లో వారు మత్తు పదార్థాలు సేవించినట్లు నిర్ధారణ కావడంతో ఎస్సై వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఇద్దరినీ పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. కాగా ఈ ఘాటనలో యువకుల వద్ద సారంజీలు స్వాధీనం చేసుకున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.