భూ రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
గౌతంపల్లిలో భూ రీ సర్వే పనుల పరిశీలన
భూముల వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): తెలకపల్లి మండలం(Telakapally mandal) గౌతంపల్లిలో కొనసాగుతున్న నీటిపారుదల కాల్వలకు సంబంధించిన భూ రీ సర్వే(Land Resurvey) ప్రక్రియను గురువారం జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్(Collector Hemant Keshav Patil) పరిశీలించారు. రైతుల భూములు, ప్రభుత్వ భూములు, నీటిపారుదల కోసం సేకరించిన భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
భూముల విస్తీర్ణం, సరిహద్దులు, రికార్డుల్లోని వివరాలను సరిచూసి ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వేలో పారదర్శకత పాటిస్తూ భూ రికార్డుల్లో కచ్చితత్వం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.