జిల్లాలో 38,377 మంది పట్టభద్రులు

06-11-2026 | 12:11am

80 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తి

మరో 1,426 దరఖాస్తులు పెండింగ్‌

అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తాం

కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC Elections) ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 38,377 మంది ఓటర్లుగా నమోదయ్యారని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ జిల్లా వివరాలను వెల్లడించారు. ఇప్పటి వరకు 80 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, మరో 1,426 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నియోజకవర్గాల వారీగా నాగర్‌ కర్నూల్‌లో 12,539, అచ్చంపేటలో 9,329, కొల్లాపూర్‌ లో 7,041, కల్వకుర్తిలో 9,468 మంది నమోదయ్యారని తెలిపారు. పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిశీలించి అర్హులైన పట్టభద్రులకు ఓటు హక్కు కల్పిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య, ఆర్డీవోలు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు