ఆపదలో అండగా మాజీ ఎమ్మెల్యే
ఇళ్లు నీట మునిగిన బాధితులకు నిత్యావసర వస్తువులు
అశ్వారావుపేట,(విజయక్రాంతి): మురుసు తుఫాన్ వరదల(Muruşu Cyclone Floods)తో ఇళ్ళు నీట మునిగిన బాధితులకు అశ్వారావుపేట బి ఆర్ ఎస్ పార్టీ అండగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఇళ్ల లో నీళ్ళు నిలిచిన బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ(Distribution of essential commodities) చేశారు. 25 కుటుంబాలు వారు ఇబ్బంది పడుతున్న విషయం స్థానిక సర్పంచ్ భారతి ద్వారా తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వర రావు(Former MLA Mecha Nageswara Rao) నిత్యవసర సరుకులు అందజేయమని అశ్వారావుపేట మండల బిఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ జూపల్లి.రమణారావు నీ ఆదేశించడం జరిగింది.
మండల బిఆర్ఎస్ నాయకులు వెంటనే బాధితులకు నిత్యావసర సరుకులు కందిపప్పు, నూనె, పంచదార, ఉప్మారవ్వ,కారం,పసుపు,ఉప్పు, ఉల్లిపాయలు,తదితర నిత్యవసర సరుకులు మరియు కూరగాయలు, బియ్యం సుమారు 25 వేల రూపాయల సరుకులను అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని,ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే పార్టీ అని ప్రతి సందర్భంలో ఫోన్ చేసిన సరే స్పందించి మీ సమస్యను పరిష్కరించటానికి బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ జూపల్లి.రమణ రావు,పద్మజ దంపతులు, కేశప్ప గూడెం సర్పంచ్ సోడెం.భారతి,రాంబాబు,మాజీ ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి,మాజీ జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాష్ రావు, మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంక.ప్రసాద్ రావు, మాజీ సర్పంచ్ సర్పంచుల సంఘం అధ్యక్షులు నారం.రాజశేఖర్ మండల నాయకులు మందపాటి మోహన్ రెడ్డి,గ్రామస్థులు పుల్లారావు వార్డు మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు.