ప్రధానోపాధ్యాయుల డిప్యూటేషన్లు రద్దు
06-11-2026 | 12:04am
డీఈఓ రమేష్ కుమార్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాల నుంచి ఇతర మండలాలకు డిప్యూటేషన్‌పై వెళ్లిన ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్ఎం డిప్యూటేషన్ల(LFL HM Deputations)ను రద్దు చేసినట్లు డీఈఓ రమేష్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దకొత్తపల్లి మండలం(Peddakottapalli Mandal)లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను గుర్తించి రెండో విడత వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా అవసరమైన ఉపాధ్యాయులను కేటాయించినట్లు తెలిపారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.