అలుగులో అంగన్వాడీ మెడిసినుకు మెమో జారీ
విజయక్రాంతిలో వార్తకు స్పందన
- విజయక్రాంతి కథనానికి స్పందించిన సిడీపీవో
బిజినేపల్లి, అక్టోబర్09 : గాంధీ జయంతి(Gandhi Jayanti) రోజున మండలంలోని పాలెం చెరువు అలుగులో వెలుగు చూసిన ప్రభుత్వ మెడిసినులో అంగన్వాడీ మెడిసిన్ను(Anganwadi medicine) కూడా గుర్తించడం జరిగింది. ఈ విషయమై అక్టోబర్ 05వ తేదిన విజయక్రాంతిలో వార్తా కథనం వెలువడింది. దీనికి స్పందించిన సిడిపివో శోభారాణి శుక్రవారం విచారణ చేపట్టారు.
విచారణ అనంతరం పాలెం గ్రామానికి చెందిన అంగన్వాడీ కేంద్రం -01 కు చెందిన మెడిసినుగా గుర్తించారు. అంగన్వాడీ కేంద్రం -01 ఆయా మణెమ్మ ఆ కేంద్రాన్ని శుబ్రపరిచే క్రమంలో మెడిసిన్ పారవేసిన్నట్లు గుర్తించారు. అంగన్వాడీ ఆయా వలన జరిగిన పొరపాటుకు అంగన్వాడీ కేంద్రం టీచర్ ప్రభావతిని భాద్యురాలిని చేస్తూ మెమో జారీ చేయనున్నట్లు సీడీపీవో శోభారాణి(CDPO Shobharani) తెలిపారు.