ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా కొమురవెల్లి భాస్కర్
సుల్తానాబాద్, అక్టోబర్ 05 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా మూడోసారి ఏకగ్రీవంగా కొమురవెల్లి భాస్కర్(Komuravelli Bhaskar) ఎన్నికయ్యారు, వైశ్య భవన్ లో ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది.
అధ్యక్షులుగా కొమురవెల్లి రామ్మూర్తి, సెక్రటరీగా పుల్లూరి రమేష్, క్యాషియర్ గా కొమురవెల్లి(కేబి) శ్రీనివాస్, శ్రీ వాసవి మాత దేవాలయం చైర్మన్ గా చకిలం మారుతి, సెక్రటరీగా నార్ల శ్రీనివాస్, పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలిగా పల్ల అపర్ణలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి అల్లంకి లింగమూర్తి వ్యవహరించారు. ఈ నూతన కమిటీ ల నియామకం పట్ల ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు సంతోషం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.