కమ్యూనిస్టు కార్యకర్తకు కన్నీటి వీడ్కోలు

24-10-2026 | 04:53pm

బిజినేపల్లి: మండలంలోని వెల్గొండ(Velgonda) గ్రామానికి చెందిన కమ్యూనిస్టు కార్యకర్త కంతం ఆంజనేయుల(CPI Activist Kantham Anjaneyulu Dies) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలిసిన సీపీఐ(CPI ) జిల్లా కార్యదర్శి ఎండీ.ఫయాజ్, జిల్లా నాయకులు ఈర్ల చంద్రమౌళి ఇతర నాయకులతో కలిసి ఆంజనేయులు గౌరవార్థం.

మృతదేహానికి ఎర్ర జెండా కప్పి నివాళి అర్పించారు. పార్టీ కోసం చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. కార్యకర్త ఆంజనేయులు కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా, మండల నాయకులు పురుషోత్తం, ఈర్ల భూపేష్ బాబు, నాగోలు శ్రీనివాస్ రెడ్డి, మన్నెం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు